బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 12:50:42

జూరాలకు భారీగా వరద.. 6 గేట్లు ఎత్తివేత

జూరాలకు భారీగా వరద.. 6 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ :  ఎగువన కర్ణాటక అధికారులు నారాయణపూర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 6 గేట్లు ఎత్తి సుమారు 56000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రాజెక్టుకు 60000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.521 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలో యూనిట్‌ల ద్వారా 117  మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo