ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 22:32:36

భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

వనపర్తి : జిల్లాలోని పాంగల్‌ మండలం మందాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ రైస్‌మిల్లు వద్ద భారీగా రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనుగోలు చేసి రెండు డీసీఎంలలో మందాపూర్‌కు తరలించగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. రెండు డీసీఎంలతోపాటు 1000బస్తాల బియ్యాన్ని సీజ్‌ చేశారు. ప్రజాపంపణీ బియ్యాన్ని యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్‌ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 


logo