ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:21

నాలుగో రోజూ అదే జోరు

నాలుగో రోజూ అదే జోరు

  • భారీగా లాభపడ్డ స్టాక్‌ మార్కెట్లు.. 
  • సెన్సెక్స్‌ 591, నిఫ్టీ 160 పాయింట్ల లాభం

ముంబై, జూన్‌ 23: స్టాక్‌ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజు సూచీలు భారీగా పుంజుకున్నాయి. ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్‌ మళ్లీ 35 వేల మార్క్‌ను దాటింది. 519.11 పాయింట్లు (1.49%) పెరిగి 35,430.43 వద్దకు చేరింది. నిఫ్టీ 159.80 పాయింట్లు (1.55%) అందుకొని 10,471 వద్ద నిలిచింది.   అమెరికాలో హెచ్‌-1బీ వీసాల తాత్కాలిక రద్దుతో ప్రారంభంలో ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి గురైనప్పటికీ, చివరికి కోలుకున్నాయి. దేశీయ మౌలిక దిగ్గజం ఎల్‌ అండ్‌ టీ 7 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ షేర్లు 6% వరకు పుంజుకొన్నాయి. వీటితోపాటు మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, నెస్లె, ఎస్బీఐ, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, టీసీఎస్‌, బజాజ్‌లు లాభపడ్డాయి. కానీ మారుతి, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. 


logo