బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 16:27:47

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..

ఆదిలాబాద్‌ : ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాథోడ్ సుభాశ్‌తోపాటు 100 మంది బీజేపీ కార్యకర్తలు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తెలిపారు. ఇటీవల కల్యాణలక్ష్మి చెక్కుల దుర్వినియోగం, పలు కుంభకోణాల్లో బీజేపీ నాయకుల పాత్ర ఉందన్నారు.

కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు గాడ్గె సుభాశ్‌, మండల కన్వీనర్ పాటుకురి శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, సీనియర్ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, సుభాశ్‌ పాటిల్, డీసీఎంఎస్‌ డైరెక్టర్ సురేశ్‌ పాటిల్, ఎంపీటీసీ వెంకటేశ్‌, దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, స్థానిక సర్పంచ్ సుభాశ్‌, సూర్యకాంత్ పాటిల్, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo