ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

ఖమ్మం : అక్రమంగా వాహనంలో తరలిస్తున్న రూ. 23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో గుట్కాప్యాకెట్లు తరలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ సతీశ్ కుమార్, రూరల్ ఎస్ఐ రాము సిబ్బందితో రూరల్ మండలం ఆటోనగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పాల్వంచ వైపు వెళ్తున్న బొలెరో వాహనం (టీఎస్ 26టీ 0450) లో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మేకల ప్రభాకర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి పాల్వంచలో చిల్లర దుకాణాదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసిందని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు చెప్పారు. వాహన డ్రైవర్ మురళి, చంటి అనే మరోవ్యక్తిని అరెస్టు చేశామని, ప్రభాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వాహనాన్ని, నిందితులను ఖమ్మం రూరల్ పోలీసులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- బెంగాల్ పోలింగ్‌పై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!
- శ్రీవారి సేవలో ఏ1 ఎక్స్‌ప్రెస్ టీమ్
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్‌కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
- కరోనా టీకా తీసుకున్న పరేష్ రావల్