బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 25, 2021 , 07:49:55

రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు

రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు

హైదరాబాద్ : వచ్చే మూడు రోజులపాటు ఎండల తీవ్రత స్పల్పంగా పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా అల్‌గోలేలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లా గౌరారంలో 35.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా స్వల్పంగా ఉక్కపోతగా ఉంటున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగుతున్నాయి. 

VIDEOS

logo