మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 19:19:13

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

హైదరాబాద్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యవంతమైన జీవనానికి మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి ఆధ్వర్యంలో హనుమాన్‌ దేవాలయ వీధిలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవాలయ వీధిలో పేరుకుపోయిన చెత్తకుప్పలను, మట్టి, రాళ్లను తొలగించే పనుల్లో టీఆర్ఎస్‌ నాయకులతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దోమల నిర్మూలనతోనే ఆరోగ్యాన్ని పొందగలమనే విషయాన్ని పౌరులు గ్రహించాలన్నారు. దోమల నిర్మూలనకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎం, పారిశుద్ధ్య సిబ్బందికి అంతా సహకరించాలని మంత్రి కోరారు.


logo