ఆటలతోనే ఆరోగ్యం : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి : శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు, వ్యాయాయం ఎంతో దోహదపడుతాయని కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడిపల్లి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం మొదటి సంవత్సర పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనయ మట్లాడుతూ.. వ్యాయామాన్ని రోజువారీ దినచర్యలో భాగంగా అలవరుచుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటామన్నారు.
తాను 68సంవత్సరాల వయస్సులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం రోజూ వ్యాయాయం చేయడమేనని తెలిపారు. మేడ్చల్ నియోజక వర్గంలో 10 మున్సిపాలిటీలు ఉన్నా ఇలాంటి వినూత్నంగా ఆలోచించే మున్సిపల్ కార్పొరేషన్ చూడలేదన్నారు. ఇలాంటి ప్రజలను ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేపడుతున్న మేయర్, కమిషనర్లను అభినందించారు. ఈ పోటీల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాట్మెంటన్, టెన్నికాయిట్, క్యారమ్, చెస్ షటిల్, తదతర క్రీడలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు
- అన్నాహజారేతో మహారాష్ట్ర మాజీ సీఎం భేటీ
- క్యారెక్టర్ ఎమోజీ పొందిన తొలి భారతీయ నటి సమంత !
- ఈత చెట్టుపై వాలి.. కల్లు తాగిన చిలుక
- రేపు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష