e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

చేర్యాల/సిద్దిపేట : ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన గోస్కి వినోద్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయనకు రెండు ఆపరేషన్లు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా క్షతగాత్రుని కుటుంబాన్ని అదుకోవాలని జడ్పీటీసీ శెట్టె మల్లేశం, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, కౌన్సిలర్‌ మంగోలు చంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కోరారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.3లక్షల ఎల్‌వోసీని మంజూరు చేయించడంతో నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు దవాఖానలో అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ, చేర్యాల ప్రాంతంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎన్నో కుటుంబాలకు చెక్కులతో పాటు ఎల్‌వోసీలను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం సీఎం కేసీఆర్‌ పట్టణ, పల్లె ప్రగతి తీసుకువచ్చి గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేయిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..

రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు

జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత

మహబూబాబాద్‌ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana