ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 01:42:13

పోషకాహారంగా తృణధాన్యాలు భేష్‌

పోషకాహారంగా  తృణధాన్యాలు భేష్‌

  • సర్వే ఫలితాలు విడుదల చేసిన ఇక్రిశాట్‌

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సందర్భంగా పోషకాహారం అందించేందుకు తృణధాన్యాలు ఉపయోగపడుతాయని పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధన కేంద్రం ఇక్రిశాట్‌ తెలిపింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎస్‌ఎంఈ)లు జరిపిన సర్వే ఫలితాలను గురువారం ఇక్రిశాట్‌లో విడుదల చేశారు. పాఠశాలల్లో ఇచ్చే మధ్యాహ్న భోజనంలోనూ అందజేయాలని వారు సూచించారు. మిల్లెట్స్‌ను 40 శాతం ఉపయోగించి ఆహార ఉత్పత్తులు చేస్తున్న పరిశ్రమలకు జీఎస్టీ నుంచి రాయితీ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఆన్‌లైన్‌ అమ్మకాలనూ ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యకరమైన, పోషకాహారమైన మిల్లెట్స్‌ వాడకం దేశంలో పెంచుకోవాలని సీఐఐ సదరన్‌ రీజియన్‌ కోరినట్టు ఇక్రిశాట్‌ తెలిపింది. కరోనా సంక్షోభంలో పోషకాహారం అందజేయడం సవాల్‌తోకూడిన అంశమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కరోనా సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు సహాయంగా ఉంటామని ఇక్రిశాట్‌ సంస్థ ప్రకటించింది.


logo