మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 01:45:56

విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు

విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు

  • కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో హెల్త్‌ప్రొఫైల్‌

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులందరికీ సమగ్ర శిక్షఅభియాన్‌లో భాగంగా వైద్యపరీక్షలుచేసి హెల్త్‌ప్రొఫైల్‌ రూపొందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో విద్యార్థుల ఆరోగ్యవివరాలు తెలుసుకొని ప్రభుత్వం జాగ్రత్తచర్యలు తీసుకోనున్నది. ఈ పథకానికి కేంద్రం సుమారు రూ.2,200 కోట్ల నిధులకు అనుమతించింది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 60:40శాతం చొప్పున నిధులు కేటాయించాలి. గత మేలో కేంద్రం నిర్వహించిన ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు(పీఏబీ)లో ఆరోగ్య పరీక్షలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించాక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమవుతున్నది. ప్రతిస్కూల్‌లో టీచర్లకు ఫిట్‌నెస్‌పై శిక్షణఇచ్చేందుకు ఇద్దరు ట్రైనర్లను నియమించనున్నారు. వారానికి ఒకసారి టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ డే’ నిర్వహిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలను పాఠాలుగా బోధిస్తారు. సిలబస్‌లో కూడా ఆరోగ్యపాఠాలు చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.


logo