శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 15:11:31

మాజీ ఎంపీ కవిత చొరవతో నిరుపేద మహిళకు వైద్యం

మాజీ ఎంపీ కవిత చొరవతో నిరుపేద మహిళకు వైద్యం

నిజామాబాద్ : అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఆపరేషన్ చేయాలి. ఆదుకోండి అని ట్వీట్ పెట్టగానే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నమహిళ‌ చికిత్స కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆమె చొరవతో పుష్ప వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి( సీఎంఆర్ఏఫ్ ) నుంచి రూ.2 లక్షల రూపాయల ఎల్వోసీ విడుదలైంది.

 నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన పుష్ప గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని‌ నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. పుష్ప ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలంటే, ఆపరేషన్ చేయాలని నిమ్స్ వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్ కు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడంతో పుష్ప కుటుంబానికి ‌ఎటూ పాలుపోలేదు. అయితే పుష్ప పరిస్థితి గురించి వివరిస్తూ పుష్ప తనయుడు దుర్గా ప్రసాద్ సహాయం చేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా కవితను కోరారు.

దీనిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, పుష్ప పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పుష్ప ఆపరేషన్ నిమిత్తం సోమవారం సీఎంఆర్ఏఫ్ నుంచి రూ.2 లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ట్వీట్ పెట్టగానే, ప్రత్యేక చొరవ తీసుకొని ఆదుకున్న మాజీ ఎంపీ కవితకు పుష్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.logo