ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 17:46:19

కోవిడ్‌-19తో చెస్ట్‌ హాస్పిటల్‌ హెడ్‌ నర్సు మృతి

కోవిడ్‌-19తో చెస్ట్‌ హాస్పిటల్‌ హెడ్‌ నర్సు మృతి

హైదరాబాద్‌ : కోవిడ్‌-19తో నగరంలోని ఎర్రగడ్డలో గల ప్రభుత్వ చెస్ట్‌ హాస్పిటల్‌ హెడ్‌ నర్సు మృతిచెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందింది. ఈ నెలాఖరులో ఆమె పదవీ విరమణ పొందాల్సి ఉంది. అంతలోనే ఇలా కరోనా భారిన పడి అశువులు బాసింది. హైదరాబాద్‌లో కోవిడ్‌-19 కారణంగా ఓ సీనియర్‌ నర్సు మృతిచెందడం ఇదే ప్రథమం. 

చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ స్పందిస్తూ... గడిచిన 20 రోజులుగా ఆమె మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. ఆస్పత్రికి రావడం లేదు. లీవ్‌ సమయంలో ఆమె కరోనా భారిన పడి ఉండొచ్చు. సీరియన్‌ పరిస్థితుల్లో ఉన్న ఆమె తనంతట తానే చెస్ట్‌ ఆస్పత్రికి వచ్చి అడ్మిట్‌ అయింది. పరిస్థితి గమనించి వెంటిలేటర్‌ సపోర్టు నిమిత్తం తామె ఆమెను గాంధీ ఆస్పత్రికి మార్చినట్లు తెలిపారు. కాగా నేడు ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు. 


logo