శనివారం 04 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 01:26:24

లొంగిపోయిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

లొంగిపోయిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

సిరిసిల్ల క్రైం: లంచం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రాజు శుక్రవారం ఏసీబీ అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 10న సిరిసిల్ల ఎల్లమ్మ ఆలయ ప్రాంతంలోని కల్లు కంపౌండ్‌ వద్ద కోనరావుపేటకు చెందిన బిర్యాని సెంటర్‌ నిర్వాహకుల నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌ ఎస్సై సుష్మిత ఏసీబీకి చిక్కగా, నగదు తీసుకున్న కానిస్టేబుల్‌ రాజు పరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎస్సై సుష్మితను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ రాజు కోసం అధికారులు గాలిస్తుండగా, శుక్రవారం కరీంనగర్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయాడు. రాజును ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విచారించగా తీసుకున్న రూ.20వేల నగదు కవర్‌ను ఆలయ కల్లుకంపౌండ్‌లో పడేసి పరారైనట్లు వివరించాడు. దీంతో రాజుతో కలిసి డీఎస్పీ సిరిసిల్లకు చేరుకొని నగదును గుర్తించారు. రాజును కూడా కోర్టులో హాజరుపరుస్తామని భద్రయ్య పేర్కొన్నారు. 


logo