గురువారం 16 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 17:11:29

శానిటైజేషన్ కోసం బస్సు స్టీరింగ్ నే వదిలేశాడు..!

శానిటైజేషన్ కోసం బస్సు స్టీరింగ్ నే వదిలేశాడు..!

సిరిసిల్ల : కరోనా కట్టడి నేపథ్యంలో డ్రైవర్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటుంటే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన నాన్‌స్టాప్‌ ఆర్టీసీ బస్సు శుక్రవారం కరీంనగర్‌ నుంచి సిరిసిల్లకు వస్తున్నది.

వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని కరీంనగర్‌ పాలడెయిరీ వద్ద డ్రైవర్‌ స్టీరింగ్‌ విడిచిపెట్టి చేతులకు శానిటైజర్‌ రాసుకుంటుండగా బస్సు అదుపుతప్పి డివైడర్‌ ఎక్కింది. దీంతో ఒక్కసారి ప్రయాణికులు భయందోళనకు గురికాగా అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపేశాడు. కాగా బస్సులో దాదాపు 20 మంది వరకు ఉన్నట్లు ప్రయాణికులు వెల్లడించారు. 


logo