భార్యాబిడ్డను పొలంలోనే వదిలేశాడు

- వరంగల్ అర్బన్ జిల్లాలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిర్వాకం
- దంపతుల మధ్య మనస్పర్థలతో పంచాయితీకి నిర్ణయం
- అంతలోనే సామగ్రితో సహ వదిలివెళ్లిన వైనం
కమలాపూర్, జనవరి 10: కాపురంలో వచ్చిన మనస్పర్థల కారణంగా ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన భార్య, కొడుకును పొలంలో వదిలేసి వెళ్లాడు. పెండ్లి సమయంలో పెట్టిన మంచాలు, వస్తువులను సైతం అక్కడే పడేశాడు. ఈ ఘటన వరంగల్ అర్బ న్ జిల్లా కమలాపూర్‌లో ఆదివా రం చోటుచేసుకొన్నది. కమలాపూర్‌కు చెందిన పిల్లి దీపకు అదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోగు ఓంకార్‌తో ఆరేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి మూడేండ్ల కొడుకు ఉన్నాడు. వివాహ సమయంలో లాంచనాలను ముట్టజెప్పారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు చోటుచేసుకోవడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ జరిగింది. అనంతరం భార్యను కాపురానికి తీసుకెళ్లిన ఓంకార్ ఇటీవల మళ్లీ చిత్రహింసలు పె ట్టాడు. దీంతో మరోసారి పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకొన్నారు. ఇదిలావుండగానే పెండ్లి సమయంలో ఇచ్చిన వస్తువులతోపాటు భార్య దీప, కొడుకును ఓం కార్ ఆదివారం శివారులోని ఓ వ్యవసాయ భూమిలో వదిలేసి వెళ్లిపోయాడు. తనకు న్యా యం చేయాలంటూ దీప అక్కడే బైఠాయించిం ది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దీపను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ