బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 07:13:58

హెచ్‌సీయూ రీసెర్చ్‌ స్కాలర్‌కు ఐదు యూనివర్సిటీల్లో అడ్మిషన్‌

హెచ్‌సీయూ రీసెర్చ్‌ స్కాలర్‌కు ఐదు యూనివర్సిటీల్లో అడ్మిషన్‌

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్‌ అమెరికాలోని 5 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ విద్యనభ్యసించేందుకు ఎంపికైనట్లు వర్సిటీ పీఆర్‌ఓ ఆశీష్‌ జెకాబ్‌ తెలిపారు. వర్సిటీలోని మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ 5వ సంవత్సరం విద్యార్థిని శిల్పి మండల్‌ పీహెచ్‌డీ విద్యనభ్యసించేందుకుగాను అమెరికాలోని 5 యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ సంపాదించినట్లు తెలిపారు. కాగా అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీలైన ఎమోరీ యూనివర్సిటీ (80), యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా (107), యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌ (351), యూనివర్సిటీ ఆఫ్‌ ఒక్లహోమా (401), లౌసియాన స్టేట్‌ యూనివర్సిటీ (501)లలో ఎంపికైనట్లు తెలిపారు. 


logo