హైదరాబాద్ : హెచ్సీయూ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ను వర్సిటీ వర్గాలు ఆదివారం విడుదల చేశాయి. ఈ నెల 21 నుంచి జులై 20 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రవేశ పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 117 కోర్టుల్లో 2,320 సీట్లను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు acad.uohyd.ac.in లో చూడాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.