శనివారం 04 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:39:20

‘నేచర్‌ ఇండెక్స్‌'లో హెచ్‌సీయూ ఫస్ట్‌

‘నేచర్‌ ఇండెక్స్‌'లో హెచ్‌సీయూ ఫస్ట్‌

  • పరిశోధనల్లో దేశవ్యాప్త విద్యాసంస్థల్లో 15వ స్థానం

కొండాపూర్‌: పరిశోధనల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దూసుకుపోతున్నది. న్యాచురల్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ (కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌) విభాగాల్లో నేచర్‌ ఇండెక్స్‌ పరిశోధనల్లో దేశంలోని విశ్వవిద్యాలయాల్లో హెచ్‌సీయూ ప్రథమ ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో 15వ స్థానంలో నిలిచింది. గతేడాది 17వ ర్యాంకులో నిలిచిన హెచ్‌సీయూ.. మరో రెండు స్థానాలను మెరుగుపరుచుకున్నది. ప్రథమ ర్యాంకుపై హెచ్‌సీయూ వీసీ పీ అప్పారావు హర్షం వ్యక్తంచేశారు. పరిశోధనల్లో శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, ఐఐటీలతో పోటీపడుతున్నామని చెప్పారు.


logo