మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 06:33:49

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ ‌:  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్‌వో తెలిపారు.  132 కోర్సుల్లో 2,456 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 16 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, 41 పీజీ కోర్సులు, 15 ఎంఫిల్‌, 10 ఎంటెక్‌, 46 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాల కోసం http://www.acad.uohyd. ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించాల్సిందిగా సూచించారు. 


logo