శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 19:59:55

మాథరన్‌ హిల్స్‌ పైకి వాహనాలకు అనుమతి

మాథరన్‌ హిల్స్‌ పైకి వాహనాలకు అనుమతి

ముంబయి: ఎకో సెన్సిటివ్‌ జోన్‌ మాథరన్‌ హిల్స్‌  పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది.  మాథరన్‌ హిల్స్‌కు అత్యవసరమైన వస్తువులు, ఆహార సామాగ్రి తీసుకెళ్లే వాహనాలను అనుమతించే విషయంపై  నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కమిటీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారష్ర్టాలోని రాయ్‌గఢ్‌ జిల్లా మాథెరన్‌ హిల్స్‌ పట్టణం 2003 నుంచి ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ఉంది. ఇక్కడికి వాహనాల రాకపోకలపై నిషేదం కొనసాగుతుంది. అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, చెత్తను తరలించే వాహనలు మాత్రమే ఇక్కడ తిరుగుతాయి. మిగితా వహనాలను చెక్‌పోస్టు దాటి లోపలికి అనుమతించరు. 

దీనిపై ఉన్న ఆంక్షలను సడలించాలని మాజీ ఎమ్మెల్యే సురేశ్‌ నారాయణ్‌ లాడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జె. కాథవల్లా విచారణ చేపట్టారు. చిన్న టెంపోలు, ట్రక్కులతో అవసరమైన వస్తువులు పట్టణంలోకి చేరవేయడానికి అనుమతి ఇవ్వాలని రాయగఢ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని కోర్టులో వాదనలు వినిపించారు. పరిస్థితిని అధ్యయనం చేయడానికి కోకన్‌ డివిజన్‌ డివిజనల్‌ కమిషనర్‌ శివాజీ దౌండ అధ్యక్షతన తాత్కాలిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్లు, హిల్‌స్టేషన్‌ పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాహణ రవాణాపై నిషేదం ఉందని కోర్టులకు ప్రభుత్వం తరవు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మీ 15వ తేదీన సమావేశం నిర్వహించి అవసరమైన వస్తువులు తీసుకెళ్లడానికి వాహనాలను అనుమతి ఇవ్వవచ్చా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 మాథరాన్‌ హిల్స్‌లో దాదాపు 4500 మంది స్థానిక నివాసితులు, చుట్టు పక్కల గ్రామాల్లో గిరిజనులు, రైతులు మొత్తం 25 వేల మంది జీవనోపాధి కోసం ఆధారపడి ఉన్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు చేతితో లాగే బండ్ల ద్వారా, గుర్రాల బండ్ల ద్వారా సరుకులు రవాణ చేసేవారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇవి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో స్థానికలు అవసరమైన వస్తువులను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.250, కూరగాయాలకు, పండ్లకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాదించారు. తదుపరి విచారణను కోర్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 


logo