ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 00:56:23

చైనాతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి

చైనాతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి

  • వీడియో కాన్ఫరెన్సులో ఎంపీ నామా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైనాను ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలి క వ్యూహాలను అవలంబించాల్సిన అవస రం ఉన్నదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్‌దేశం అండగా నిలువాలని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితిలో రాజకీ  యం కాదని, యుద్ధనీతి కావాలని చెప్పారు. శనివారం పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌ సంస్థ దేశంలోని పలు పార్టీల ఎంపీలతో జూమ్‌ యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. తెలంగాణ నుంచి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. గల్వాన్‌ దుర్ఘటనలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రూ.5కోట్ల ఆర్థికసాయం, ఆయన సతీమణికి గ్రూప్‌-1 ఉద్యోగం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇచ్చారని, ఇదే ఘటనలో మరణించిన దేశంలోని ఇతర సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చారని నామా నాగేశ్వరరావు గుర్తుచేశారు. 


logo