మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 22:04:32

శంషాబాద్‌ విమానాశ్రయానికి హవల్దార్‌ పరశురాం పార్థివ దేహం

శంషాబాద్‌ విమానాశ్రయానికి హవల్దార్‌ పరశురాం పార్థివ దేహం

మహబూబ్‌నగర్‌‌ : జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో సైన్యంలో హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పరశురాం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన భౌతికకాయం శనివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తోపాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరశురాం భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

పరశురాం కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.  ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో డబుల్‌ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. సంక్షేమ నిధి నుంచి నిధులు విడుదలయ్యేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సైతం పరశురాం కుటుంబానికి పరిహారం అందించాలని కోరారు. ఆదివారం పరశురాం స్వస్థలం గుండీడ్‌ మండలం గువ్వనికుంట తండాలో  సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.