విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టాలి

- మతోన్మాదుల నుంచి నగరాన్ని కాపాడుకుందాం
- టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా నాయకులతో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మహానగరాన్ని మతోన్మాదుల నుంచి కాపాడుకుని టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషిచేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎన్నారై నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని కోరారు. బుధవారం ఎన్నారై ఆస్ట్రేలియా నాయకులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై వారికి ఆమె దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలోనూ చురుకుగా వ్యవహరించి టీఆర్ఎస్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయలాంటిదని, దీన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి చేతిలో పెట్టొద్దని ప్రజలకు వివరించాలని కవిత సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎన్నారై నాయకులు అభినయ్ కనపర్తి, ఆకాశ్‌రెడ్డి, నరేశ్ జవ్వాజి, ఆయాన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ