సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 06:16:47

గ్రామాలలో 5 లక్షల మొక్కలు నాటే దిశగా..

గ్రామాలలో 5 లక్షల మొక్కలు నాటే దిశగా..

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరేండ్ల క్రితం వర్షాకాలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం ఆరో విడుతకు సన్నద్ధ్దమవుతున్నది. ఈ సంవత్సరం మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు ఐదు లక్షల మొక్కలు నాటేందుకు యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. అటవీయేతర ప్రభుత్వ భూము లు, పాఠశాలలు, కళాశాలలు, రహదారులు, ప్రభుత్వ కా ర్యాలయాలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు అంతా సిద్ధ్దం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయిం చి మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

16 నర్సరీల్లో 5 లక్షల మొక్కలు సిద్ధం

 హరితహారంలో భాగంగా మండలంలో 14 గ్రామపంచాయతీల నర్సరీలు, 2 అటవీశాఖ నర్సరీల్లో సుమారు 5 ల క్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నర్సరీల్లో టేకు, వేప, కానుగ, జామ, మామిడి, బాదం, బ త్తాయి, తుమ్మ, ఎర్రచందనం, ఈత, అల్లనేరేడు, తులసి ప లు రకాల మొక్కలను నర్సరీల్లో  సిద్ధంగా ఉంచారు. ఐదు విడుతల్లో నాటిన మొక్కలను కాపాడేందుకు సర్పంచ్‌లు,పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రెండు, మూడు రోజులకోసారి మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తూ సంరక్షిస్తున్నారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు దర్శనమిస్తున్నాయి.logo