గురువారం 02 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:45:57

దేవునిగూడేనికి లక్ష మొక్కల హారం

దేవునిగూడేనికి లక్ష మొక్కల హారం

చెట్ల నరికివేతతో చదునుగా మారిన నిర్మల్‌ జిల్లా దేవునిగూడెం అడవి పూర్వవైభవం సంతరించుకొన్నది. ఐదేండ్ల క్రితం హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ మొక్క నాటి ప్రజల్లో స్ఫూర్తినింపారు. నాడు 200 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటగా ఇప్పుడు అవి చెట్లుగా ఎదిగాయి. 2015 జూలై 5న కేసీఆర్‌ చేతులమీదుగా దేవునిగూడెంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 21 రకాల మొక్కలను లక్షకుపైగా నాటారు. మొదటి ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో.. ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసి మొక్కలను కాపాడారు. ప్రస్తుతం మొక్కలన్నీ పెరిగి అడవికి పునర్జీవం వచ్చింది. 
logo