సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:33

హరితహారం ట్విట్టర్‌కు విశేష స్పందన

హరితహారం ట్విట్టర్‌కు విశేష స్పందన

  • 5 వేల ఫాలోవర్లను దాటిన ట్విట్టర్‌ ఖాతా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ హరితహారం ట్విట్టర్‌ ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య మంగళవారంనాటికి 5వేలకు చేరుకున్నది. నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుండడంతో ప్రభుత్వ విభాగంలో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన అతికొద్ది ట్విట్టర్‌ ఖాతాల సరసన ‘తెలంగాణకు హరితహారం’ చేరింది. ఇప్పటికే హరితహారం ఫేస్‌బుక్‌ పేజీని 30వేల మంది నెటిజన్లు అనుసరిస్తున్నారు. ఆరోవిడుత హరితహారంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటేలా ట్విట్టర్‌ ఖాతా నెటిజన్లను చైతన్యపరుస్తున్నది.



logo