బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 13:35:39

జయశంకర్ భూపాలపల్లిలో జోరుగా ర‌హ‌దారి వ‌నాల పెంప‌కం

జయశంకర్ భూపాలపల్లిలో జోరుగా ర‌హ‌దారి వ‌నాల పెంప‌కం

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో నేడు హరిత జయ కార్యక్రమం చేప‌ట్టారు. ఒకే రోజు ఒక్క గంటలో లక్ష మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. 142 గ్రామాల పరిధిలో 162 ప్రాంతాల్లో 252  కిలో మీటర్ల పరిధిలో రహదారి వనాల కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేప‌ట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 11 గంటలకు ముగిసింది. అందరూ కలిసి లక్షా నాలుగు వేల మొక్కలను నాటారు. గ్రామాల వారీగా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు తమ ఊరికి దారి తీసే రోడ్లు, గ్రామానికి, గ్రామానికి మధ్య రహదారులపై మొక్కలు నాటారు. రక్షణ కోసం ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. 

మెగా అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాన రహదారి పక్కన కలెక్టర్ అబ్దుల్ అజీమ్ మొక్కలు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అటవీ, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ స్పందిస్తూ... గంటలో లక్ష మొక్కలకు పైగా నాటిన ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు నమోదు కోసం పంపిస్తామని తెలిపారు. ప్రతీ శుక్రవారం హరితదినం పాటిస్తూ మొక్కలను కాపాడుకుంటామని డీఎఫ్ఓ పురుషోత్తం తెలిపారు.logo