శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 11:50:24

భావితరాల భవిష్యత్తు కోసం హరితహారం : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

భావితరాల భవిష్యత్తు కోసం హరితహారం : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

కరీంనగర్‌ : భావితరాల భవిష్యత్తు కోసం హరితహారం కార్యక్రమం అని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా చొప్పదండి పట్టణంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా చొప్పదండి పట్టణంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo