బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 12:18:47

ప్రయాణికుల సమస్యలు పరిష్కరించిన హరీశ్ రావు..వీడియో

ప్రయాణికుల సమస్యలు పరిష్కరించిన హరీశ్ రావు..వీడియో

సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు తన కాన్వాయ్ లో  సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో శామీర్ పెట్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను చూసి కారు ఆపారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా...? వాహనాలు ఉన్నాయా..? ఏం  ఇబ్బంది ఉంది..? ఇక్కడ ఎందుకు ఆగారు? అని హరీశ్ రావు వారిని అడిగి తెలుసుకున్నారు.  

పోలీసులు వెళ్లనివ్వటం లేదని ప్రయాణికులు చెప్పడంతో..మంత్రి హరీశ్ రావు అక్కడే ఉన్న పోలీస్ అధికారులను పిలిచారు.  వారికి వాహనాలు ఉన్నాయ్, పాస్ లున్నాయ్.. వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు పంపించండి అని పోలీస్ అధికారులను ఆదేశించారు. తమ సమస్యను విని పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ రావుకు అక్కడ ఉన్న ప్రయాణికులు నవ్వుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలీస్ అధికారుల అనుమతితో వారి స్వస్థలాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. logo