గురువారం 09 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 21:39:54

యోగాతో వ్యాధి నిరోధకశక్తి: మంత్రి హరీశ్‌రావు

యోగాతో వ్యాధి నిరోధకశక్తి: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: యోగాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశం. జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతీరోజు సాధన చేయాలి. నేను రోజూ యోగాసాధన చేస్తున్నా.’ అని మంత్రి పేర్కొన్నారు. 

సిద్దిపేట జిల్లాలో యోగాను గతేడాది నుంచి అన్నీ వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లామని, పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని హరీశ్‌రావు వెల్లడించారు. యెగాతో ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తి మన శరీరానికి లభిస్తుందన్నారు. దీనికి ఎలాంటి ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని అందరినీ యోగా సాధనకు సాదరంగా ఆహ్వానిస్తున్నా.. యోగా చేద్దాం.. ఆరోగ్య తెలంగాణగా మార్చుదాం.’ అని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. logo