బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 13:09:21

దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించిన హరీశ్‌రావు

దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించిన హరీశ్‌రావు

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు నీళ్లు అందించే ప్రధాన కాలువను మంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్‌ నుంచి కాలువ వెంట సుమారు 40 కిలోమీటర్లు ఆయన పర్యటించారు. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించారు. ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. 


logo