బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:29

15 గంటలు.. 200 కిలోమీటర్లు

15 గంటలు.. 200 కిలోమీటర్లు

  • దుబ్బాక నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటన 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం 5 మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. 10 గ్రామాలు.. 15 గంటలు.. 200 కిలోమీటర్ల దూరం పర్యటించారు. ఉదయం రాయిపోల్‌ మండలం ఎల్కల్‌, బేగంపేట్‌, వడ్డెపల్లి, రాంసాగర్‌, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి నార్సింగి మండలంలో రోడ్‌షో, చేగుంట మండలంలోని కొండాపూర్‌లో యువగర్జన, దుబ్బాకలో పలువురి చేరికలు, మిరుదొడ్డి మండలం మోతె, కూడవెల్లి, అక్బర్‌పేట, భూంపల్లిలో ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో యవత పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.  

మేమే వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతాం 

సర్‌.. మీరెక్కడున్నారు.. మేము టీఆర్‌ఎస్‌లో చేరుతాం అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు శనివారం మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌ చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి గులాబీ కండువా కప్పుకొన్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌కు  చెందిన బీజేపీ కార్యకర్తలు రాయపోల్‌ మండలంలో ప్రచారంలో ఉన్న హరీశ్‌రావు వద్దకు వచ్చి పార్టీలో చేరారు. దౌల్తాబాద్‌ మండలం ముబారస్‌పూర్‌కు చెందిన బీజేపీ యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.