శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 13:39:02

ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

సిద్దిపేట‌: టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్‌రావు వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. దుబ్బాక ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌కు వివించారు. దుబ్బాకలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళిని వారికి వివ‌రించారు. ఈఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్ర‌పై దిశానిర్దేశం చేశారు. 

ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక‌లో ఉపఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. దీంతో రామ‌లింగా రెడ్డి భార్య సుజాత‌ను టీఆర్ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించింది. మంత్రి హ‌రీశ్‌రావు ముమ్మ‌రంగా ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. ఉపఎన్నిక‌లు వ‌చ్చేనెల 3న జ‌ర‌గున్నాయి. వ‌చ్చేనెల 10న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఈనెల 16తో నామినేష‌న్ల గ‌డువు ముగియ‌నుంది. 

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి ఘ‌న‌విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి నాగేశ్వరరెడ్డిపై ఆయ‌న 62,500 ఓట్ల తేడాతో గెలుపొందారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా, నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి.