శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 20:22:04

రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడికి రావాలి: మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడికి రావాలి: మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి:  గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులు  రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇచ్చి ఇక్కడికి రావాలని సూచించారు.

'తెలంగాణలోని  ఏడు మండలాలను ఆంధ్రాలో, లోయర్‌ సీలేరు ప్రాజెక్టును అప్పనంగా ఆంధ్రాకు కట్టబెట్టిన పార్టీ బీజేపీ. బీజేపీ ఆఫీస్‌లో కుర్చీలు ఎగురుతున్నాయి. షర్ట్‌లు చిరుగుతున్నాయి.  మీ మధ్య మీకే సమన్వయం లేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని' హరీశ్‌ రావు విమర్శించారు. 

'ఐజీఎస్టీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు బీజేపీ ఇవ్వడం లేదు. బీఆర్‌జీఎఫ్‌ నిధులు ఇవ్వకుండా బీజేపీ మొండి చేయి చూపుతోంది.  డిసెంబర్‌ 1వ తేదీన మీ ఛార్జ్‌షీట్‌కు హైదరాబాద్‌ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.  బెంగళూరు, గుజరాత్‌లలో వరదలు వస్తే బీజేపీ డబ్బులు ఇచ్చింది.  హైదరాబాద్‌కు వరదలు వస్తే ఎందుకు సాయం చేయలేదని' మండిపడ్డారు.