శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 20:23:26

దమ్ముంటే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి: హరీశ్‌ రావు

దమ్ముంటే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి: హరీశ్‌ రావు

హైదరాబాద్‌: నగరంలో  అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతినగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్‌రెడ్డికి మద్దతుగా బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు  పాల్గొని ప్రసంగించారు.    

'టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఉచితంగా మంచినీళ్లు ఇస్తాం. ఎన్నికల తర్వాత వరద బాధితులందరికీ సాయం అందిస్తాం. ఐదేళ్ల కిందట కరెంట్‌ పరిస్థితి మీకు తెలుసు.  ఇవాళ రాష్ట్రంలో కరెంట్‌ సమస్యలు లేకుండా చేశాం. హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు చేస్తరు.  సర్జికల్‌ స్ట్రైక్‌ చేయడానికి హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా. మనమేమైనా పాకిస్థాన్‌లో ఉన్నామా. బీజేపీ నేతలకు దమ్ముంటే పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  హైదరాబాద్‌లో 6లక్షల 60వేల కుటుంబాలకు వరద సాయం అందించామని' హరీశ్‌ రావు పేర్కొన్నారు.