బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 19:04:56

కార్గిల్ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకున్న మంత్రి హ‌రీశ్‌రావు

కార్గిల్ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకున్న మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సైనికుల త్యాగాల‌ను స్మ‌రించుకున్నారు. ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి స్పందిస్తూ... సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవద‌న్నారు. జవాన్ల ధైర్య సాహసాలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు.

కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని యావత్‌ ప్రపంచం నేడు కొనియాడుతుంది. ఆ యుద్ధంలో సైనికులు చూపిన‌ త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేమ‌న్నారు. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంద‌న్నారు.


logo