ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 12:19:55

కేసీఆర్ చరిత్ర తిర‌గరాశారు : మ‌ంత్రి హ‌రీష్ రావు

కేసీఆర్ చరిత్ర తిర‌గరాశారు : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : తెలంగాణ‌లో నైజాం పాలన నుంచి స‌మైక్యాంధ్ర పాల‌న వ‌ర‌కు భూమి శిస్తు వ‌సూలు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం భూమి ఉన్న ప్ర‌తి రైతుకు రైతుబంధు ప‌థ‌కం ద్వారా డ‌బ్బులిచ్చి చ‌రిత్ర తిర‌గ‌రాశార‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు.  దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక నేప‌థ్యంలో తొగుట మండ‌లం ఘ‌న‌పూర్‌లో మంత్రి హ‌రీష్ రావు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. రైతుల‌కు నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక‌ ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వ‌డం లేదు. గ‌తంలో ఓట్ల కోసం లీడ‌ర్లు గ్రామాల‌కు వ‌స్తే మ‌హిళ‌లు ఖాళీ నీటి బిందెల‌తో నిర‌స‌న తెలిపి తాగునీటి కోసం ప్ర‌శ్నించేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నార‌ని తెలిపారు. విదేశీ మ‌క్క‌లు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మ‌ట్టి కొట్టాల‌ని బీజేపీ నాయ‌కులు చూస్తున్నారు. బీజేపీ నాయ‌కుల‌కు ఓట్ల ద్వారానే బుద్ది చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. దుబ్బాక అభివృద్ధి త‌న బాధ్య‌తే అని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు.