శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 18:11:31

సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది: హరీశ్‌ రావు

సీఎం కేసీఆర్‌  చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది: హరీశ్‌ రావు

హైదరాబాద్‌:  శాసనసభలో  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు   కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టడంపై ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.  రెవెన్యూ శాఖలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్కరణలు నవశకానికి నాంది  అని పేర్కొన్నారు. 

'అవినీతి, ఆలస్యం బాధల నుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది. రెవెన్యూలో  సీఎం కేసీఆర్‌  చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయి. ముఖ్యమంత్రి  కేసీఆర్‌  గారికి కృతజ్ఙతలు' అంటూ హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. logo