శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 01:21:48

ఒక్కకేసూ నమోదు కావొద్దు

ఒక్కకేసూ నమోదు కావొద్దు

-సిద్దిపేట జిల్లా అధికారుల టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాకుండా ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఇప్పటివరకు అధికారులు, సిబ్బంది చక్కగా పనిచేశారని, ఇదే స్ఫూర్తిని చివరివరకు కొనసాగించాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, వార్డుసభ్యులు అంతా అలర్ట్‌గా ఉండాలని, ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించాలని కోరారు. logo