e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home తెలంగాణ Huzurabad | ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ కుట్రలు : హరీశ్ రావు

Huzurabad | ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ కుట్రలు : హరీశ్ రావు

హుజురాబాద్ : బీజేపీ ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని హరీశ్ రావు అన్నారు. ఆయన బుధవారం హుజురాబాద్ లోఎల్ఐసీ ఎజెంట్ల తో జరిగిన సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ “ఎల్ఐసీ సేవలు ఎనలేనివి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చే సంస్థ ఎల్ఐసీ అని, అలాంటి సంస్థను బీజేపీ మాయం చేసే కుట్రలు చేస్తుంది, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ను నాశనం చేశారు. 50వేల ఉద్యోగులను ఇంటికి పంపారు, అందుకే ఎల్ఐసీ ప్రైవేట్ పరం చేసే కుట్రలకు తెగపడుతున్న బీజేపీని ఓడించాలన్నారు”. “ఏజెంట్ల ఒక్క ఓటుతో రెండు ప్రయోజనాలు ఉన్నాయి, ప్రభుత్వం పై వ్యతిరేక ఓటు వేసిన వారవుతారు.

- Advertisement -

రెండోది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించినట్లు అవుతుంది,గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే రెండేళ్లు అభివృద్ధి జరుగుతుంది, మరో రెండేళ్లు అధికారంలో ఉండేది సీఎం కేసీఆర్ ప్రభుత్వం, ఈటల రాజేందర్ గెలిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది..?కరీంనగర్ ఎంపీ బండి సంజాయ్ గెలిచి ఈ మూడేళ్ళుల్లో ఏ గ్రామనికైనా రూ.10 లక్షలు ఇచ్చాడా..?బీజేపీ అభివృద్ధి చేసిందా..? రేపు ఈటల రాజేందర్ అభివృద్ధి కి ఎలా కృషి చేస్తారు..? అని ప్రశ్నించారు. ఎల్ఐసీ ఏజెంట్లకు ఒక్క భవనం కట్టించడా..? ఈ 18 ఏండ్లల్లో ఏం చేశారు..? మీ ఎల్ఐసీ వారి కోసం ఈటల ఏం చేశారు..? బీజేపీకి వ్యతిరేకంగా ఏజెంట్లు పోరాటం చేస్తేనే ఎల్ఐసీ ఉంటుందని,టీఆర్ఎస్ గెలిస్తే ఎల్ఐసీకి లాభమా..? బీజేపీ గెలిస్తే లాభమా విజ్ఞత మీకే.. హుజురాబాద్ కు పెద్ద పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే సీఎం కేసీఆర్ మనసు గెలుద్దాం.. టీఆర్ఎస్ ను గెలిపిద్దాం”అని హరీశ్ అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana