శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 23, 2020 , 03:12:32

ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావు

ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావు

  • జాతీయ స్థాయి వివాదాల పరిష్కార వేదికలో ఆర్థిక మంత్రికి చోటు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కింది. ఏడు రాష్ర్టాలకు చెందిన ఆర్థికమంత్రులతో కమిటీని ఏర్పాటుచేస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. హరీశ్‌రావుతోపాటు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.


logo