ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Apr 16, 2020 , 14:53:39

కష్టపడ్డ ప్రతి రైతుకు ఫలితం దక్కుతుంది : హరీష్‌రావు

కష్టపడ్డ ప్రతి రైతుకు ఫలితం దక్కుతుంది : హరీష్‌రావు

సిద్దిపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో 7 వేల వరి, మొక్కొజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కుక్‌ మండలంలోని వరదరాజ్‌పూర్‌, గజ్వేల్‌ మండలంలోని సిమెగాటం గ్రామాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కష్టపడ్డ ప్రతి రైతుకు ఫలితం దక్కుతుందన్నారు మంత్రి. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు టోకెన్లు లేకుండా రైతులు ధాన్యాన్ని తీసుకురావొద్దు. వరి పంట కోసిన తర్వాత బాగా ఆరబెట్టి కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. 


logo