బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:12:19

మినీ పార్కును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

మినీ పార్కును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు సిద్దిపేట‌లో ఏర్పాటు చేసిన మినీ పార్కును నేడు ప్రారంభించారు. కోర్టు జంక్ష‌న్ వ‌ద్ద గ‌ల క్లాక్ ట‌వ‌ర్ చుట్టూ ఏర్పాటు చేసిన మినీ పార్కును మంత్రి ప్రారంభించారు. రూ. 4 ల‌క్ష‌ల వ్య‌యంతో సిద్దిపేట అర్భ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఈ పార్కును అభివృద్ధి చేసింది. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ... సిద్దిపేట సుద్ద‌రీక‌ర‌ణ‌లో భాగంగా ప‌ట్ట‌ణంలోని అన్ని జంక్షల‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్మ‌న్ కె. రాజ‌న‌ర్సు, సుడా చైర్మ‌న్ ఎస్‌. ర‌వీంద‌ర్ రెడ్డి, వైస్ చైర్మ‌న్ కేవి. ర‌మ‌ణా చారి, త‌దిత‌రులు పాల్గొన్నారు.logo