ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 03:25:18

నోరుపారేసుకుంటున్న ప్రతిపక్షాలు : హరీశ్‌రావు

నోరుపారేసుకుంటున్న ప్రతిపక్షాలు : హరీశ్‌రావు

  • ఎప్పుడు ఏం మాట్లాడాలో తెల్వదు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: రైతుల విషయమై ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతిపక్షాలు నోరుపారేసుకుంటున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు ఏద్దేవా చేశా రు. సోమవారం సిద్దిపేటలో వ్యవసాయంపై అధికారులతో  సమీక్ష నిర్వహించారు. సిద్దిపేటలోని నర్సాపురంలో నిర్మించి న డబుల్‌ బెడ్రూం ఇండ్లను వచ్చేనెలలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి నంగునూరు చౌడుచెరువుకు జలహారతినిచ్చారు.


logo