ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపలేదు:మంత్రి హరీశ్‌రావు

మెదక్: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మెదక్ క్యాంపు కార్యాలయంలో 33మంది లబ్ధిదారులకు రూ.33,00,528 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో మెదక్, హవేళిఘనపూర్ మండలాలకు చెందిన 22మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన రూ.12లక్షల 50వేల సబ్సిడీ రుణాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ తదితర సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ పేద, బలహీన వర్గాలకు అండగా ఉంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. యాసంగి పంటకు రైతాంగానికి రైతుబంధు పథకం కింద రూ.7200 కోట్లు అందించనున్నామన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రభుత్వం ఇతర ఖర్చులు తగ్గించుకొని, సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నదని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీలు ఎదిగేందుకు 90శాతం సబ్సిడీ రుణాలు అందజేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం ఎ
తాజావార్తలు
- కరీ‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్