బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 20:48:21

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి : మంత్రి హరీశ్‌రావు

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాలిటీలోని 20, 21, 23 వార్డుల్లో స్టీల్‌ బ్యాంక్‌ ఫెసిలిటీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకుండా.. అతిథులకు సేవలందించేందుకు ఉక్కు పాత్రలు వినియోగించాలని సూచించారు. మెప్మాలోని రీసోర్స్‌ పర్సర్లు ప్రతి రోజు కాలనీలను సందర్శించి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు వినియోగం ఆవశ్యకతను తెలుపాలని చెప్పారు. అనంతరం రూ.50లక్షలతో పట్టణంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు దోమలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డులను మంత్రి సందర్శించి, ప్రజలకు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కె.రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo