శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:42:50

ప్లాస్మా దానం చేయాలి: మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ప్లాస్మా దానం చేయాలి: మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కరోనాను జయించిన వ్యక్తులు.. ప్లాస్మా దానానికి ముందుకు రావాలని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కొవిడ్‌ టెస్టింగ్‌ (ఆర్టీపీసీఆర్‌) ల్యాబ్‌ను, మున్సిపల్‌ కార్యాల య ఆవరణలో మొబైల్‌ టెస్టింగ్‌ బస్సును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ ల్యాబ్‌ ద్వారా ప్రతి 8 గంటలకు ఫలితం వస్తుందన్నారు. షిఫ్ట్‌కు 96 చొప్పున రెండు షిప్టులు నడిపి రోజుకు 192 మందికి ఫలితాలు వచ్చేలా చూస్తామన్నారు. 


logo