మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 13:37:28

నేను ఇంట్లోనే ఉన్నాను... మీరు ఇంట్లోనే ఉండండి: హరీశ్‌రావు

నేను ఇంట్లోనే ఉన్నాను... మీరు ఇంట్లోనే ఉండండి: హరీశ్‌రావు

హైదరాబాద్‌: జనతా కర్ఫ్యూ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా కుంటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నాను. పోలీసులు, మిలటరీ వాళ్లు పెట్టిన దానికన్నా మీరు స్వచ్చందంగా ఈ కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. 

ఎం కాదనే ధోరణి వద్దే వద్దు. ఇలాంటి ధోరణి వలన ఇటలీ, చైనా లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో చూస్తున్నాం. మనకు ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం. మన కుటుంబాన్ని, దేశాన్ని, రాష్ర్టాన్ని రక్షించుకుందామని మన ఇంట్లో మనం ఉందాం. కరోనాను ఖతం చేద్దామని పిలుపునిచ్చారు. logo
>>>>>>