గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 19:06:27

గంగిరెద్దుల యువ‌త‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌!

గంగిరెద్దుల యువ‌త‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌!

సిద్దిపేట : గ‌ంగిరెద్దుల యువ‌త‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇప్పించి ఉపాధి క‌ల్పిస్తామ‌ని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని నాంచారుపల్లి గ్రామంలో నిర్మించిన 36 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను మంత్రి హ‌రీష్ రావు శుక్ర‌వారం ప్రారంభించారు. వీటిలో 20 ఇండ్ల‌ను గంగిరెద్దుల కుటుంబాల‌‌కు, మిగ‌తా 16 ఇండ్ల‌ను ఎస్సీ కుటుంబాల‌కు కేటాయించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గంగిరెద్దుల క‌మ్యూనిటీకి చెందిన యువ‌త‌కు ఎన్‌ఏసీ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) స‌హాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇప్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎంబీసీ కార్పొరేష‌న్ ద్వారా రుణాలు ఇప్పించి.. వారు నేర్చుకున్న వృత్తిలో ఎద‌గ‌డానికి తోడ్పాటును అందిస్తామని మంత్రి చెప్పారు.  

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం కంటే ముందు.. నాంచారుప‌ల్లి స్టేజీ నుంచి తోర్నాల వ‌ర‌కు బీటీ రోడ్ల ప‌నుల‌కు మంత్రి శంకుస్థాప‌న చేశారు. 31 కిలోమీట‌ర్ల మేర నిర్మించే డ‌బుల్ లేన్ రోడ్డుకు రూ. 23 కోట్లు కేటాయించారు. 

తాజావార్తలు


logo